హనుమకొండలోని జక్రియా ఫంక్షన్ హాల్లో ఈనెల 21న జరగనున్న 4వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే కుంగ్ఫూ పోటీలను జయప్రదం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, తాడిశెట్టి విద్యాసాగర్, రమేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.