ADB: ఈ నెల 11న జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుందని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. మంగళవారం ఆమె నార్నూరులో పర్యటించారు. ఎన్నికల అధికారులను ఓటర్లు సహకరించాలని కోరారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ఉండాలని హెచ్చరించారు. సరైన ధ్రువపత్రాలు లేక రూ.50 వేలకు మించి నగదు తరలించవద్దని పేర్కొన్నారు.