ASF: ఇందిరమ్మ ఇళ్లు త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, నర్సరీలో మొక్కల పెంపకం, ఈనెల 14వ పేరెంట్స్ కమిటీ సమావేశంపై సమీక్ష నిర్వహించారు. 2 రోజులలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు పనులు ప్రారంభించేలా చూడాలన్నారు.