SDPT: దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో శనివారం ఉదయం గృహిణి పెద్దోళ్ల సుష్మ(32) ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు అందించినట్లు దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తెలిపారు. సుష్మ భర్త శ్రీకాంత్, అత్త ఎల్లవ్వ, మామ బాబు వేధింపులు చేస్తున్నారని మృతురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినారు.