HYD : JNTUH యూనివర్సిటీ క్యాంపస్‌లోని సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ పురుషుల జట్టు ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో యూనివర్సిటీకి పేరు తేవాలన్నారు.