MNCL: జన్నారం మండలంలోని తపాలపూర్ గ్రామానికి చెందిన ఎదుల చంద్రయ్య, వోడ్డేపల్లి శ్రీనివాస్‌లను జన్నారం తాహసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ముందు బైండోవర్ చేసామని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ సుష్మారావు తెలిపారు. చంద్రయ్య శ్రీనివాస్ తపాల్పూర్ బీట్ అటవీ ప్రాంతంలో రంపం, జియో వైర్ తో ఉండగా ఎఫ్ఎస్ఓ నహిదా, బేస్ క్యాంప్ వాచర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని వివరించారు.