SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చివ్వెంల మండలం చందుపట్ల గ్రామాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడానికి పోలీసులు భారీగా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈరోజు రెండు గ్రామాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విశాలమైన ఫ్లాగ్ మార్చ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సూర్యాపేట డీఎస్సీ ప్రసన్న పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.