సంగారెడ్డి పట్టణంలో విజయ్ దివస్ వేడుకలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పూలమాల వేశారు. అనంతరం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ ఛైర్మన్ మాణిక్యం, సీడీసీ మాజీ ఛైర్మన్ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.