MDCL: కూకట్పల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ సప్తగిరి కాలనీకి చెందిన రాజేందర్ వైద్య చికిత్స కోసం CMRF నుంచి రూ.2.75 లక్షల ఎల్ఓసీ పత్రాన్ని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల సంక్షేమానికి, వారి ఆరోగ్య భద్రతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.