WGL: గత నెల 21న WGL మున్సిపాలిటీలోని కాశీబుగ్గలో మద్యం మత్తులో తల్లి కూరపాటి వెంకటమ్మ (65)ను కొట్టి చంపిన పెద్ద కుమారుడు రాజును ఇంతేజార్గంజ్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. చిన్న కుమారుడు కుమారస్వామి ఫిర్యాదుతో కేసు నమోదైన తర్వాత రెండు వారాలుగా గాలింపు చేపట్టిన పోలీసులు, సాంకేతిక సహాయంతో నిందితుడు రాజును పట్టుకుని రిమాండ్కు పంపారు.