HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. బైపోల్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని నిలబెట్టింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రభంజనం ముందు దీపక్ నిలవలేకపోయారు. మొత్తం 10 రౌండ్ల కౌంటింగ్‌లో ఒక్క రౌండ్లోనూ లీడ్‌లోకి రాలేకపోయారు. చివరికి డిపాజిట్ కూడా కోల్పోయారు.