ASF: దహెగా మండలంలోని గిరవెల్లి, కర్జి గ్రామాల రైతులకు ఏవో రామకృష్ణ మంగళవారం వరి కొయ్యలను కాల్చడం వల్ల కలిగే నష్టాలను గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు ఎవరూ వరి కొయ్యలను కాల్చవద్దని అన్నారు. సాగు విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.