KNR: బెజ్జంకి మండలాన్ని ప్రజల అభిమతానికి విరుద్ధంగా కరీంనగర్ జిల్లాలోంచి వేరు చేసి సిద్ధిపేట జిల్లాలో కలిపిన నిర్ణయాన్ని రద్దు చేయించి, తిరిగి పూర్వ జిల్లాలో చేర్చేందుకు తాను ముందుండి పోరాడతానని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంఘ రవి హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా సాధన సమితి సభ్యుల సమక్షంలో 50 రూపాయల బాండ్‌పై సంతకం చేసి సమర్పించారు.