WNP: ఈనెల 31న పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లే భక్తులకు వనపర్తి నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు జిల్లా D.M దేవేందర్ గౌడ్ తెలిపారు. వనపర్తి డిపో నుంచి ఈనెల 29న సాయంత్రం బయలుదేరుతుందన్నారు. ఈనెల 30న కాణిపాకంలో వినాయకుడి దర్శనం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, అనంతరం అరుణాచలంలో గిరిప్రదక్షిణ ఉంటుందన్నారు. టికెట్ ధర రూ.3600గా నిర్ణయించినట్లు వెల్లడించారు.