ASF: ఆసిఫాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ డాక్టర్ సుభోద్ (ప్లాస్టిక్ సర్జన్)ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన అంకుశాపూర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బాధ్య తలు స్వీకరించారు. మెడికల్ కళాశాల సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించారు. ఇందులో ఇంఛార్జ్ ప్రిన్సిపల్ విజయ్ లక్ష్మి ఉన్నారు.