RR: శంషాబాద్‌లో అక్రమ మద్యం కల్తీ రాకెట్‌ను ఎక్సైజ్ అధికారులు బట్టబయలు చేశారు. ఈ వ్యవహారంలో ఐదుగురిని అరెస్టు చేసి, సుమారు రూ.8 లక్షల విలువైన కల్తీ మద్యం, ఖాళీ సీసాలు, స్టిక్కర్లు, సీలింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధర మద్యం నింపి, ఖరీదైన బ్రాండ్ల పేరుతో అమ్ముతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.