MLG: ఏటూరునాగారంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బాలే నర్సయ్య కుటుంబాన్ని ఆదివారం ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.