NZB: అగ్రికల్చర్ కళాశాల త్వరలో తెలంగాణ యూనివర్సిటీలో శంకుస్థాపన చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తుందన్నారు. జిల్లాలో 35 ఏళ్ల నిరీక్షణకు తెరదించి ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేశామన్నారు. కరీంనగర్, బాసర రోడ్డు అభివృద్ధికి రూ.350 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.