MNCL: స్థానిక ఎన్నికల్లో గెలవబోయేది టీఆర్ఎస్ మద్దతుదారులేనని టీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జన్నారం మండలంలోని కలమడుగు, పోన్కల్ గ్రామాలలో టీఆర్ఎస్ మద్దతు దారుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.