ASF: సీఎం పర్యటనతోనైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయని పెంచికల్పేట్ మండల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మండలంలో సరైన రోడ్డు సౌకర్యం లేక, వర్షం వస్తే మార్గాలన్నీ బురదమయంగా మారి రాకపోకలు స్తంభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ రాలేని దుస్థితి ఉందన్నారు.