SRCL: ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి గ్రామంలో బెల్ట్ షాప్పై పోలీసులు దాడి చేసి భారీగా మద్యాన్ని పట్టుకున్నారు. చిప్పలపల్లి గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ముస్తాబాద్ ఎస్సై సిహెచ్.గణేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిందితుడు నారాయణపురం చంద్రం వద్ద నుంచి ఏకంగా 10.440 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.