BDK: భద్రాద్రి జోన్ పరిధిలోని 22 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైగా పదోన్నతి కల్పిస్తూ ఇంఛార్జ్ రేంజ్ డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ పదోన్నతి లభించింది.