BHPL: తెలంగాణా రాష్ట్ర దివ్యంగుల శాఖ ఆదేశాల మేరకు రేపు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాలులో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని రకముల దివ్యాంగులు ఉదయం 11 గం”లకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.