NLG: ప్రజలను ఆరోగ్యంగా, ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్న మద్యం అధిక తాగుడుకు కళ్లెం వేయడానికి, మద్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో వైన్ల గురించి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇందులో భాగంగా చండూరు మండలంలో మద్యం షాపుల యజమానులు నేటి నుంచి మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్ ఓపెన్ చేస్తున్నారు.