SRPT: సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా ఎన్యూమరేటర్లు పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో జరుగుతున్న సర్వేను పరిశీలించి మాట్లాడారు. ఎన్యూమరేటర్లు అన్ని కుటుంబాల సమగ్ర సమాచారం సేకరించాలని సూచించారు. వారి వెంట తహసీల్దార్ దయానందం, ఎంపీడీవో శేషు కుమార్, ఎంఈఓ పాల్గొన్నారు.