ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని CPM ML మాస్ లైన్ నాయకులు జగన్ సింగ్ మంగళవారం అన్నారు. మహిళలకు ప్రతినెల రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. వృద్ధులు, వికలాంగులకు రూ.4వేల పెన్షన్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. సంబరాలు చేసుకోకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు.