WGL: నల్లబెల్లిలో గ్రోమోర్ సెంటర్ వద్ద ఇవాళ యూరియా బస్తాల కోసం మహిళా రైతులు వేచి చూస్తున్నారు. యాసంగి పంటల సాగుబడి కోసం విక్రయించేందుకు వచ్చి ఉదయం నుంచి ఎదురుచూస్తున్నమని తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి రైతులకు సకాలంలో యూరియా అందించి పంటల దిగుబడికి సహకరించాల్సిందిగా కోరారు. కాగా, రాష్ట్రంలో యూరియా కోరత వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.