HYD: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల GHMCలో 2 మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ప్రాంతం, జనాభాకు అనుగుణంగా పాలన సౌలభ్యం కోసం ఈ వార్డుల పెంపు జరిగింది. ఈ విస్తరణతో 2,735 చదరపు కి. మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించింది.