ADB: గాదిగూడ మండలంలోని మారేగావ్ నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు శుక్రవారం ఆదివాసీలు మహార్యాలీ నిర్వహించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. అలాగే సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు లంబాడీలకు ఎలాంటి ధ్రువపత్రాలు జారీ చేయవద్దని కోరారు.