ASF: కాగజ్ నగర్ మండలంలోని పెద్దవాగు సమీపంలో శుక్రవారం బారికెడ్లను ఏర్పాటు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. వాహనదారులు రోడ్డు చట్టాలను అనుసరిస్తూ వాహనాలను నడపాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన, మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారుడు లైసెన్స్, ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని, హెల్మెట్ తప్పనిసరి అన్నారు.