ADB: గ్రామాల అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రూరల్ మండలంలోని భీంసరీ గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు.