HYD: తిరుమలగిరి జయలక్ష్మి గార్డెన్లో ఆదివారం ఒడిశా పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర కల్చరల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మినీ ఇండియా లాంటిదని, అన్ని వర్గాల ప్రజలు ఉంటారని పేర్కొన్నారు. అన్ని మతాల పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు.