తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులకు వేదికగా మారింది. HYD భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో ఇప్పటి వరకు రూ. 5,39,495 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. మొదటి రోజు సుమారు రూ. 2,43,000 కోట్లు, రెండో రోజు ఇప్పటి వరకు రూ. 2,96,495 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ఇండస్ట్రీ, ఐటీ, ఫార్మా, ఫారెస్ట్, టూరిజం రంగాలు ఉన్నాయి.