KNR: మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా వారి కోసం ప్రత్యేక వైద్య కేంద్రం ఏర్పాటు చేసి సేవలు అందిస్తామని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వారధి సొసైటీ సహకారంతో మున్సిపల్ కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ కార్యక్రమం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది.