HYD: ఉస్మానియా యూనివర్సిటీలో పదేళ్ల కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులను కాంగ్రెస్ అక్కున చేర్చుకుని 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. ఆదివారం ఓయూలో చనగాని దయాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజాపాలన కృతజ్ఞత సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.