NZB: సంక్రాంతి వేళ కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తప్పవని ఆర్మూర్ SHO సత్యనారాయణ గౌడ్ హెచ్చరించారు. శనివారం పాత నేరస్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి, తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఆర్మూర్, ఆలూరు పరిసరాల్లో జూదం, పందాలు ఆడితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.