SDPT: గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియను జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతుందని, ఏఏంసీలలో వరితో పాటు మక్కలు కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మక్కలు, వరి ఒకేసారి రావడంతో హమాలీ, లారీల కొరత ఏర్పడిందని, బయట రాష్ట్రాల హమాలీ, స్థానికులను కేంద్రాల్లో ఉంచామన్నారు.