MLG: ఏటూరునాగారం పట్టణ పరిసర గ్రామాల్లో ఎండలతో పాటు వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ఉదయం నుంచే భానుడి భగభగలతో ఆదివారం రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాలుల ప్రభావంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడగాలుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.