SRD: ఖేడ్ మండలం లింగాపూర్లోని అంగన్వాడి భవనానికి మరమ్మత్తులు చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ ఏఈ విద్యాసాగర్ అన్నారు. ఈ మేరకు గురువారం గ్రామాన్ని సందర్శించి భవనాన్ని పరిశీలించారు. ప్రత్యేక నిధులు రూ. 2.50 లక్షలతో భవనంలో ఫ్లోరింగ్ టైల్స్ పెయింటింగ్, కిటికీలు, స్లాబ్పై సిమెంట్ ఫ్లోరింగ్ పనులు చేయించాలని స్థానిక సర్పంచ్ రుక్మిణి హనుమాన్లుకు సూచించారు.