NGKL: పెద్దకొత్తపల్లి మండలం నైనపల్లి మైసమ్మ ఆలయం వద్ద తాగు నీటి సమస్య తీవ్రంగా మారినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా మారడంతో భక్తులు ట్యాంకుపైకి ఎక్కి బకెట్లతో నీరు తీసుకుంటూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.