WGL: జిల్లాలో రెండో దశ నామినేషన్ల స్వీకరణ నేడు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రెండో విడతలో 564 జీపీలు, 4928 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 2 వరకు నామినేషన్ల స్వీకరణ అనంతరం, 3న పోటీలో ఉన్న వారి జాబితాను సాయంత్రం 5 గంటలకు ప్రదర్శించనున్నారు. 6న నామినేషన్ల ఉపసంహరణ, 14న పోలింగ్ ఉండనుంది.