KNR: చొప్పదండి పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు విజయ్ దివస్ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.