హనమకొండ జిల్లా కేంద్రంలో ఇటీవలి భారీ వర్షాలతో పలు కాలనీలు నీట మునిగిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం ఉదయం కలెక్టర్ స్నేహ సబరీష్ ఆదేశాల మేరకు మునిసిపల్ అధికారులు ఆరు ఫైరింజన్లతో వరద నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వరద నీటిని తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.