MNCL: లక్షెట్టిపేట మండలంలోని పోతపల్లి ప్రభుత్వ పాఠశాలను ఎంఈవవో శైలజ తనిఖీ చేశారు. బుధవారం ఆమె పాఠశాలను సందర్శించి వివిధ రికార్డులను పరిశీలించారు. అలాగే ఉపాధ్యాయుల బోధన తీరును కూడా ఆమె పర్యవేక్షించారు. విద్యార్థులకు ఆటపాటలతో విద్యాబోధన చేస్తే పాఠాలు త్వరగా అర్థమవుతాయని ఆమె అన్నారు. అనంతరం విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.