MBNR: మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి మహబూబ్నగర్ మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు నడపనున్నారు. 07111 హుజూర్ సాహిబ్ నాందేడ్ ఎక్స్ప్రెస్ పేరుతో నడిచేయి రైలు ప్రతి గురువారం సాయంత్రం 6 గంటలకు మహబూబ్నగర్ నుంచి బయలుదేరుతుందన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని షాద్ నగర్ జడ్చర్ల మహబూబ్నగర్ వనపర్తి రోడ్ గద్వాల స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని తెలిపారు.