WGL: రాయపర్తి మండలం సన్నూరు చెందిన హమాలీ కార్మికుడు యాకయ్య (45) ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో పని చేస్తూ ఎండ తీవ్రతకు గురై అస్వస్థత చెందారు. ధాన్యం బస్తాలు మోస్తూ కుప్పకూలిపోయిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.