KNR: కరీంనగర్లోని ముకరంపురలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నాలుగో అంతస్తును శనివారం సీజ్ చేసినట్లు పట్టణ ప్రణాళిక అధికారులు తెలిపారు. శంకర్ అనే వ్యక్తి అనుమతులు లేకుండా, అనధికారికంగా నిర్మిస్తున్న నాలుగో అంతస్తును హైకోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేశారు. మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టామని.. తిరిగి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేయవద్దు అని అన్నారు.