ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 4 సర్పంచ్ స్థానాలు, 26 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 10 సర్పంచ్ స్థానాలకు 4 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 6 స్థానాలకు 22 మంది తుది పోటీలో నిలిచారు. 90 వార్డుల్లో 26 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 64 వార్డులకు ఈ నెల 14న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.