VKB: స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష అధికారులను ఆదేశించారు. కుల్కచర్ల మండలం కామునిపల్లి క్లస్టర్‌ను సందర్శించారు. ఎన్నికలకు సంబంధించిన స్కూటినీ ప్రక్రియను, పోలింగ్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్పంచుల ఎన్నికలను సజావుగా నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.