NLG: చిట్యాల మండలం ఉరుమడ్లకి చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. 1981లో వార్డు మెంబర్‌గా ఎన్నికైన ఆయన, వెనుదిరగకుండా ఎంపీ, ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగారు. 3 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మెన్‌గా పదవులు నిర్వహించిన ఆయన ప్రస్తుతం మండలి ఛైర్మెన్‌గా కొనసాగుతున్నారు.